ఒక సంగీత దర్శకుడి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'తొలిపాట'. ఋషి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రాఘవేంద్ర డిజిటల్ స్టూడియో సమర్పణలో ఇ.శ్రీనివాసరాజు, కె.శ్రీనివాసరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.రాఘువేంద్ర దర్శకుడు. కృష్ణవాసా, మాధవీలత ('నచ్చావులే' ఫేమ్) జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారంనాడు జరిగింది. సీనియర్ నటుడు ఎం.బాలయ్య ఆడియో సీడీని ఆవిష్కరించి మరో నటుడు జెన్నీకి అందజేశారు. పారిశ్రామిక వేత్త లక్ష్మీకాంత రెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని మాధవీలతకు అందజేశారు. కృష్ణవాసా సంగీతం అందించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైందినటుడు బాలయ్య మాట్లాడుతూ, ఇందులో తాను బాగా డబ్బున్న పారిశ్రామిక వేత్తగా నటించాననీ, సంగీతం పట్ల హీరోకి ఉండే తపనను గుర్తించి అతన్ని ప్రోత్సహించే విధంగా తన పాత్ర ఉంటుందనీ చెప్పారు. నటులెవరు, చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని కాకుండా బాగున్న చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనీ, ఈ చిత్రం కూడా అలాంటి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఇదొక మ్యూజికల్ మెలోడీ చిత్రమని దర్శకుడు రాఘవేంద్ర చెప్పారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కృష్ణవాసా తెలిపారు. ఇందులో ఓ చక్కటి పాత్ర పోషించినట్టు మాధవీలత తెలిపింది. చిత్ర నిర్మాతలతో పాటు సహ నిర్మాతలు నాగేంద్ర సోలంకి, అరుణ్, జి.దయాకర్ రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు
No comments:
Post a Comment