Thursday, November 5, 2009

'సలీమ్' లోగో ఆవిష్కరణ

మంచు విష్ణువర్దన్ బాబు, ఇలియానా హీరోహీరోయిన్లుగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సలీమ్'. దీనికి 'దుమ్ము దులుపుతాడు' అనే ట్యాగ్ లైన్ ఉంది. రిలయెన్స్ బిగ్ పిక్చర్స్, శ్రీ లక్ష్మీపసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మాత. ఇందుో ఆయన ఓ ప్రత్యేక పాత్ర కూడా పోషిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారంనాడు జరిగింది.

మోహన్ బాబు మాట్లాడుతూ, సలీమ్ చిత్రం ఆడియోను ఈనెల 11న విడుదల చేస్తున్నామనీ, అదే రోజు సినిమా గురించి, టెక్నీషియన్ల వివరాలపై తాను మాట్లాడతాననీ అన్నారు. డిసెంబర్ మొదటివారంలో కానీ, రెండో వారంలో గానీ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో విష్ణువర్దన్, వైవిఎస్ చౌదరి, పాటల రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్, నటుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment