skip to main |
skip to sidebar
'ఓయ్' దర్శకుడి వివాహం
సిద్దార్ధ కథానాయకుడుగా నటించిన 'ఓయ్' చిత్రం దర్శకుడు ఆనంద్ రంగా, 'రేడియో మిర్చి' రేడియో జాకీ సౌమ్య వివాహం ఆదివారంనాడు జరుగనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.రేడియో జాకీగా పాపులర్ అయిన సౌమ్య డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలియానా, కాజల్, నయనతార వంటి పలువురు తారలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఇటీవల 'లక్ష్యం' చిత్రంలో అనుష్కకు డబ్బింగ్ చెప్పినందుకు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆనందర్ రంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో మొదట్నించీ మంచి అనుబంధం ఉంది. 'నువ్వు లేక నేనులేను', 'జెమినీ' వంటి పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. తొలిసారి 'ఓయ్' చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఆనంద్ రంగా వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది
No comments:
Post a Comment