
ఎస్.వి.ఆర్. మీడియా సంస్థ సిఇఓ శోభారాణి మాట్లాడుతూ, వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిదనీ, హీరో సాయిరాం శంకర్ కు 'బంపర్ ఆఫర్' తర్వాత చాలా మంచి చిత్రమవుతుందనీ చెప్పారు. సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయిరాం శంకర్ చక్కటి ప్రతిభ చూపారనీ, బంపర్ ఎంటర్ టైన్ మెంట్ తో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ తెలిపారు. హీరోయిన్ సుహానిసి చాలా ఫ్రెష్ లుక్ తో, చక్కటి హావభావాలతో మంచి నటన ప్రదర్శించిందని అన్నారు. దర్శకుడు రాజేందర్ దర్శన్ 'ఖుషీ', 'సంక్రాంతి', 'ఎవడైతే నాకేంటి', 'అందాల రాముడు' వంటి ఎన్నో హిట్ చిత్రాలు కో-డైరెక్టర్ గా పనిచేశారనీ, ఆ అనుభవంతా రంగరించి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనీ చెప్పారు. ఆర్.పి.పట్నాయక్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న 6 పాటలు చాలా హుషారుగా యూత్ ఫుల్ గా ఉంటాయన్నారు. మంచి సాంకేతిక విలువలతో మలేసియాలోని చక్కటి లొకేషన్లలో 40 రోజుల పాటు షూటింగ్ చేశామన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతరాలు కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ ప్రథమార్థంలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరేష్, వేణుమాధవ్, ఆలీ, చంద్రవాస్, కోట శంకర్ రావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్ వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ తదితరులు నిటంచారు. కల్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ పైట్స్, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్ అందించారు.
No comments:
Post a Comment