Thursday, November 5, 2009

సింగీతం 'ట్రాఫిక్ జామ్'

అపూర్వ సహోదరులు', 'ఆదిత్య 369', 'పుష్పక విమానం', 'భైరవద్వీపం' వంటి ఎన్నో విలక్షణ చిత్రాలను అందించిన క్రెడిట్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు దక్కుతుంది. ఆయన దర్శకత్వంలో 'త్యాగయ్య' చిత్రం కూడా రూపుదిద్దుకుంటోంది. కమర్షియల్ ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించడంలో దిట్ట అయిన సింగీతం ఇప్పుడు మరో విలక్షణ ఇతివృత్తంతో 'ట్రాఫిక్ జామ్' అనే చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిని ఆదిత్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొండా కృష్ణంరాజు నిర్మించనున్నారు.

సింగీతం శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఎన్నో చిత్రాలు తాను చేసినప్పటికీ ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న కథ 'ట్రాఫిక్ జామ్' అనీ, ఇది తన కెరీర్ లో ఒక కలికుతురాయిలా నిలిచిపోతుందనే నమ్మకం ఉందనీ అన్నారు. ఆదిత్య ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలకు రచన చేసిన ప్రముఖ రచయిత జె.కె.భారవి మాటలు రాస్తున్నారనీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ చెప్పారు. విశ్వసనీయ సమచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయకుడుగా నటిచేందుకు అల్లరి నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది

No comments:

Post a Comment