Tuesday, November 3, 2009

పోకిరి'ని మించిన 'మగధీర'

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పోకిరి' అప్పట్లో సూపర్ డూపర్ హిట్. 42 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా రాబట్టి అత్యధిక థియేటర్లలో సెంచరీ కొట్టిన రికార్డును ఆ చిత్రం సాధించింది. 75 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులు బద్దలయ్యాయి. ఆ చిత్రం తమిళంలో 'పోక్కిరి'గా, హిందీలో 'వాంటెడ్'గా రీమేక్ అయి కలెక్షన్ల దుమారం రేపింది. తాజాగా 'పోకిరి' రికార్డులను 'మగధీర' అధిగమించనుంది.

రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం సంచలన విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిది. భారత సినీ చరిత్రలోనే 'గజనీ' తర్వాత అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 60 కోట్లకు పైగా ఈ చిత్రం రాబట్టింది. ఇంతవరకూ ఉన్న అర్ధ శతదినోత్సవ రికార్డులను కూడా బ్రేకే చేసి 302 కేంద్రాల్లో 'మగధీర' ఆమధ్య హాఫ్ సెంచరీ చేసుకుంది. తాజాగా రికార్డు సెంటర్లలో సెంచరీకి కూడా ఈ చిత్రం దగ్గరవుతోంది. 'పోకిరి' చిత్రం 200 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోగా, 'మగధీర' చిత్రం ఈనెల 7వ తేదీతో 223 సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకోనుంది. 'పోకిరి' రికార్డులు తిరగరాయడం సాధ్యం కాదని పలువురు వేసిన అంచనాలకు 'మగధీర' చెక్ పెట్టనుంది

No comments:

Post a Comment