Wednesday, November 4, 2009

మీరాజాస్మిన్ హారర్ ఫిల్మ్

సస్పెన్స్, హారర్ కథాంశాలతో వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇటీవల కాలంలో మంచి ప్రేక్షకాదరణ చూరగొన్నాయి. ఛార్మి నటించిన 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర', భూమిక 'అనసూయ', అనుష్క 'అరుంధతి' చిత్రాలు ఈ తరహాలోనివే. ఇప్పుడు మీరాజాస్మిన్ వంతు వచ్చింది. ఆమె తొలిసారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవలే 'బ్లాక్ అండ్ వైట్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ వేములపల్లి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అమర్ నాథన్ మూవీస్ పతాకంపై పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'మోక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

శ్రీకాంత్ వేములపల్లి మాట్లాడుతూ, ఇదొక హారర్ చిత్రమనీ, ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ టచ్ చేయని వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందనీ, ఈ సబ్జెక్ట్ కు మీరాజాస్మిన్ మాత్రమే న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎంపిక చేశామనీ చెప్పారు. మరో కీలక పాత్రను రాజీవ్ మోహన్ పోషించనున్నట్టు తెలిపారు. ఈనెల 11 నుంచి డిసెంబర్ 11 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుతామనీ, డిసెంబర్ చివరి వారంలో చెన్నైలో జరిపే మరో షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ నిర్మాత అమర్ నాథ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాహుల్ దేవ్, రాజ్యలక్ష్మి తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ఆర్.పి. ఛాయాగ్రాహకుడు.

No comments:

Post a Comment