skip to main |
skip to sidebar
ప్రియమణి కన్నడ హవా!
తమిళ 'పరుత్తివీరన్' చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమనటి అవార్డును అందుకున్న ప్రియమణి తెలుగులోనూ బిజీ హీరోయిన్. జగపతిబాబుతో 'ప్రవరాఖ్యుడు' చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ప్రియమణి మళ్లీ జగపతిబాబుతోనే మరో చిత్రానికి కమిట్ అయింది. తమిళ, హిందీ భాషల్లో మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 'రావణ్' లోనూ ఆమె నటిస్తోంది. ప్రియమణికి ఇది తొలి హిందీ చిత్రం కూడా కాబోతోంది. ఆసక్తికరంగా ఇప్పుడు కన్నడంలోనూ తన సత్తా చాటుకోనుంది. బెంగుళూరుకు చెందిన ప్రియమణి కన్నడం ఆలవోకగా మాట్లాడుతుంది. అయితే ఇంతవరకూ కన్నడంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. సరైన ఆఫర్ రాకపోవడం వల్లనే చేయలేదని తరచు ఆమె చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆమె కన్నడంలో కాలుపెట్టింది. 'రామ్' పేరుతో కన్నడంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు జోడిగా ఆమె నటిస్తోంది. మాదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉంది. ఆసక్తికరంగా ఇప్పుడు మరో కన్నడ చిత్రానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా పేరు పెట్టని రెండో చిత్రంలో గోల్డెన్ స్టార్ గణేష్ కు జోడిగా ప్రియమణి నటించనుంది. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు త్రిష అంగీకరించినప్పటికీ, ఆమె తొలిసారిగా హిందీలో నటిస్తున్న 'కట్టా మీటా' షూటింగ్ ప్రారంభం కావడంతో డేట్లు ఇవ్వలేని పరిస్థితిలో పడింది. దీంతో ఆ ఆఫర్ ప్రియమణి చేతిలోకి వచ్చింది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభిచేందుకు చిత్ర నిర్మాత చంద్రశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కంటే కన్నడంలో ఎక్కువ బిజీగా ఉన్న ఆర్.పి.పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు
No comments:
Post a Comment