
వరుణ్ సందేష్ మాట్లాడుతూ, ఆడియో ఆవిష్కరణ సమయంలో తాను 'మరోచరిత్ర' షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నాననీ, ఆడియో మంచి సక్సెస్ కావడంతో ప్లాటినం డిస్క్ కు వచ్చిందన్నారు. 'ఏమంటావే', 'కుర్రాళ్లోయ్' పాటలు రేడియోలలో మారుమోగుతున్నాయని అన్నారు. తన గత చిత్రాలకు మిక్కీ, మణిశర్మ వంటి వారు సంగీతం అందించారనీ, ఈ చిత్రానికి అచూ వైవిధ్యమైన సంగీతం అందించారని చెప్పారు. ఈ చిత్రంలో రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా ఉంటుందన్నారు. సందీప్ గుణ్ణం చాలా చక్కగా సినిమాను తెరకెక్కించారనీ, ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ, సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, అనంత్ శ్రీరామ్ మంచి సాహిత్యం అందించారనీ అన్నారు. మధుమిత పాడిన ఐటెం సాంగ్ హైలైట్ అవుతుందన్నారు. దర్శకుడుగా తనకు అవకాశమిచ్చిన జెమినీ కిరణ్ కు తన కృతజ్ఞతలని అన్నారు. ఈనెల 12న సినిమా విడుదలవుతుందని చెప్పారు. 'ఏమంటావే' పాట తన ఫేవరెట్ అని చిత్ర సంగీత దర్శకుడు అచూ తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ కు ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది
No comments:
Post a Comment