Tuesday, November 3, 2009

అసిస్టెంట్ డెరెక్టర్ నాగచైతన్య

'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్ జరుపుకొని ప్రస్తుతం అమెరికాలో భారీ షెడ్యూల్ జరుపుకొంటోంది. ఈ చిత్ర విశేషాలను గుట్టుగా ఉంచుతున్నప్పటికీ ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను నాగచైతన్య పోషించబోతున్నట్టు సమాచారం.

'జోష్'లో విద్యార్థి నాయకుడుగా నటించిన నాగచైతన్య రెండో చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ పోషిస్తుండటం సహజంగానే క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఇదొక చక్కటి రొమాంటిక్ డ్రామాగా గౌతమ్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన సమంత ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ చివర్లో కానీ, సంక్రాంతి కానుకగా కానీ విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నాగచైతన్య సొంత బ్యానర్ లాంటి అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై లారెన్స్ దర్శకత్వంలో ఒక చిత్రం ఉంటుందనీ, నాలుగో చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తారనీ, ఐదో చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందనీ తెలుస్తోంది

No comments:

Post a Comment