Monday, November 2, 2009

యూనివర్ సెల్' మహేష్

దక్షిమాదిన మొబైల్ విప్లవాన్ని సృష్టించి, మొబైల్ కమ్యూనికేషన్ రిటైలర్లలో అగ్రగామిగా పేరుతెచ్చుకున్న చెన్సై బేస్డ్ సంస్థ 'యూనివర్ సెల్'కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పనిచేయనున్నారు. ఒక రిటైల్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు పనిచేయడం కూడా ఇదే ప్రథమం. అమీర్ పేట షోరూమ్ లో ఆదివారంనాడు యూనివర్ సెల్ కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ బాబు, యూనివర్ సెల్ వ్యవస్థాపకుడు సతీష్ బాబుతో పాటు ఆ కంపెనీకి చెందిన రమేష్, రాజగోపాల్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

యూనివర్ సెల్ కు భారతదేశంలో నెంబర్ 1 రిటైల్ చైన్ గా పేరుందనీ, దక్షిణాదిలో 300 స్టోర్ లకు ఆంధ్రప్రదేశ్ లో 70 స్టోర్లు ఉన్నాయనీ సతీష్ బాబు తెలిపారు. యూనవర్ సెల్ ఎనర్జీ, ప్రిన్స్ మహేష్ బాబు సమ్మోహన శక్తి కలిసి వినియోగదారులకు చక్కటి అనుభూతులను అందిస్తాయని అన్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ, సరసమైన ధరలకు అత్యుత్తమ మొబైల్స్ అందిస్తున్న యూనివర్ సెల్ లో భాగం కావడం సంతోషంగా ఉందనీ, సంస్థ అభివృద్ధిలో తాను చెప్పకోదగిన పాత్ర నిర్వహించగలనని అనుకుంటున్నాననీ అన్నారు. యూనివర్ సెల్ నిర్వహించిన పోటీలో విజేతలైన వారితో మహేష్ బాబు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు కూడా మహేష్ బాబు నవ్వుతూ సమాధాన మిచ్చారు. వెండితెరపై కనిపించడం కన్నా కార్పొరేట్ కంపెనీల ఫంక్షన్లలో తరచు కనిపించడానికి కారణం ఏమిటని అడిగిన ఓ ప్రశ్నకు, మరిన్ని ఎక్కువ సినిమాలు చేయాలని తాను కూడా అనుకుంటున్నాననీ, అయితే అనుకోని కారణాల వల్ల తన సినిమాల విజయంలో జాప్యం తలెత్తిన మాట నిజమేననీ అన్నారు. ఇక నుంచి తాను నటించిన చిత్రాలు ఏడాదికి కనీసం రెండు ప్రేక్షకుల ముందుకు వస్తాయని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment