skip to main |
skip to sidebar
'రోమియో' ముహూర్తం
ఆర్యన్ రాజేష్, శ్రద్ధాఆర్య జంటగా, శ్రీహరి కీలక పాత్రలో నటించిన చిత్రం 'రోమియో'. దీనికి 'ఎ డిఫరెంట్ లవర్' అనేది ట్యాగ్ లైన్. సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రమిది. రామకృష్ణ దర్శకుడు. కొద్దికాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల మూడో వారంలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన దానికంటే బాగా సినిమాను మలిచారనీ, ప్రేక్షకులను థ్రిల్ చేసే చిత్రమిదనీ చెప్పారు. ధనవంతుడైన వ్యక్తిగా శ్రీహరి నటించారనీ, ఆయన చెల్లెలి ప్రేమను కథానాయకుడు ఎలా పొందాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ తెలిపారు. మధుర ఎంటర్ టైన్స్ మెంట్స్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. శ్రీహరి, ఆర్యన్ రాజేష్ చక్కటి నటన ప్రదర్శించారనీ, శ్రీహరికి ఆపోజిట్ విలన్ గా చరణ్ రాజు, శ్రీహరి పిఏగా రఘుబాబు నటించారనీ, సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి, ప్రేమ పట్ల నమ్మకం కలిగన అమ్మాయి పాత్రను శ్రద్ధ ఆర్య పోషించిందనీ తెలిపారు. పాటలతో మంచి మంచి ఫైట్స్ కూడా ఉందులో ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సంతోష్ పవన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, గౌతంరాజు, సైరాభాను, వైజాగ్ ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు నటించారు. వనమాలి పాటలు, రాజేంద్ర సినిమాటోగ్రఫీ, అగస్త్య సంగీతం అందించారు
No comments:
Post a Comment