Friday, November 6, 2009

బాద్ షా తో తమన్నా

తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే మరి. 'శ్రీ' చిత్రంతో తెలుగులోనూ, 'కేడి' చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టిన బ్యూటీ తమన్నాకు ఆ చిత్రాల ఫలితం అప్పట్లో చేదు అనుభవం మిగిల్చింది. అయితే ఆ తర్వాత రెండు భాషల్లోనూ ఇంచమించు ఒకేసారి కెరీక్ కు టర్నింగ్ వచ్చింది. తెలుగులో 'హ్యాపీడేస్', తమిళంలో 'కల్లూరి' చిత్రాలు ఆమెను నటిగా బిజీ చేశాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె తక్కువగానే నటిస్తున్నా తమిళంలో మాత్రం నెంబర్ వన్ రేసులో ఉంది. తాజాగా తమన్నా కథానాయికగా నడించిన 'కందేన్ కాధలై' చిత్రం తమిళంలో మంచి సక్సెస్ సాధించడంతో ఆమె ఎకాఎకిన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ దృష్టిలో పడిందట. హిందీలో విజయవంతమైన 'జబ్ ఉయ్ మెట్' చిత్రానికి ఇది రీమేక్.షారూక్ ఇటీవలే 'కందేన్ కాథలై' చిత్రం చూసి తమన్నా నటనకు ఎంతో ఇంప్రెస్ అయ్యారని కోలీవుడ్ వర్గాల భోగట్టా. ఆమెకు ఎలాగైనా తన తదుపరి చిత్రంలో అవకాశమివ్వాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారట. బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు దక్షిణాది హీరోయిన్లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో బాద్ షా దృష్టి తమన్నాపై పడటంతో త్వరలోనే ఆమె ముంబై పయనం కానుందని అంటున్నారు. ఆసిన్ 'గజనీ'తో ఈమధ్యనే హిందీలోకి అడుగుపెట్టగా, ప్రియమణి తాజాగా మణిరత్నం 'రావణ' తోనూ, త్రిష 'కట్టా మీటా' చిత్రంతోనూ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అన్నీ కలిసొస్తే ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారూక్ నటించనున్న చిత్రం ద్వారా తమన్నా కూడా బాలీవుడ్ లో పాగా వేసే అవకాశాలు దండిగా ఉన్నాయి.

No comments:

Post a Comment