
హీరో రాజా మాట్లాడుతూ, జరిగిపోయిన జీవితం ఇంకోసారి మన ముంగిటకు వస్తే ఏం చేస్తామన్నదే ఈ చిత్రం కాన్సెప్ట్ అని చెప్పారు. ఏడుగురు స్నేహితులు ఏడేళ్ల అనంతరం కలుసుకుంటారనీ, ఈ నేపథ్యంలో వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నది తెరపై చూడాల్సిందేననీ అన్నారు. కేవలం 23 ఏళ్ల వయసున్ సుమన్ పాతూరి ఈ చిత్రాన్ని వైవిధ్యభరితంగా మలిచారనీ, నిర్మాత కల్యాణ్ సినిమా మీద ఉన్న పాషన్ తో అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇక్కడకు వచ్చారనీ చెప్పారు. తన కెరీర్ లో ఇంతవరకూ 30 సినిమాలు చేసినప్పటికీ, ఆనంద్, వెన్నెల చిత్రాలంటే ఎంతో ఇష్టమనీ, ఆ కోవలో తాను ఇష్టపడే మూడో చిత్రమిదని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ, కథ చాలా బాగుందనీ, మంచి సక్సెస్ సాధించే చిత్రమిదనీ అన్నారు. 'వెన్నెల' చిత్రం మాదిరిగానే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు మహేష్ శంకర్ చక్కటి సంగీతం అందించారని అన్నారు. పాటలు వింటుంటే స్నేహం అంటే ఇంత అందమైందా అని అనిపించిందని మరో అతిథిగా విచ్చేసిన హీరో తనీష్ అన్నారు. సుమన్ పాతూరి మాట్లాడుతూ, వెన్నెల చిత్రం చేయక ముందే మహేష్ శంకర్ తో తనకు పరిచయముందనీ, ఈ చిత్రానికి వీనుల విందైన సంగీతం అందించాడనీ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, హీరో రాజాతో పాటు నిర్మాత కల్యాణ్ అందించిన సహకారం మరువలేనిదనీ అన్నారు. ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, సోమ విజయ్ ప్రకాష్, దర్శకులు శేఖర్ సూరి, దేవ కట్టా, హీరోయిన్లు రిచా, మంజరి, నటుడు సందీప్, లక్ష్మీకాంత్, రాజ్ పిప్పల, నాగరాజు గంధం, ఆషిక, రాజన్ డి.కె.రాజు, యూత్ కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment