skip to main |
skip to sidebar
క్రిష్ 'వేదం' సంక్రాంతికి
తెలుగు సినిమాకి కొత్త దిశా నిర్దేశం చేసిన 'గమ్యం' చిత్రం తర్వాత జాగర్లమూడి రాథాకృష్ణ అలియాస్ క్రిష్ మరో వైవిధ్య భరితమైన కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం 'వేదం'. ఇది మల్టీస్టారర్ చిత్రం కావడంతో సహజంగానే టాలీవుడ్ మరో కొత్త ట్రెండ్ కు ఆయన శ్రీకారం చుడుతున్నారనే అభిప్రాయాలకూ తావిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రామిసింగ్ హీరో మంచు మనోజ్, సంచలన నటి అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా పతాకంపై యార్గగడ్డ శోభనాద్రి, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకొంటూ షూటింగ్ చివరి దశలో ఉంది.స్లమ్ లో నివసించే యువకుడుగా అల్లు అర్జున్, రాక్ స్టార్ గా మంచు మనోజ్, కథకు కీలకమైన వేశ్య పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ప్రతి పాత్ర వైవిధ్యంగా ఉంటుందనీ, చక్కటి కథ కథనాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిదని క్రిష్ చెబుతున్నారు. 'గమ్యం' తరహాలోనే కాన్సెప్ట్ ప్రధానంగా సాగుతూ పూర్తి కమర్షియల్ విలువలతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతారనీ, 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
No comments:
Post a Comment