skip to main |
skip to sidebar
కాజల్ హీరోయిన్ గా 'ఓంశాంతి'
'చందమామ' చిత్రంతో కెరీర్ లో మంచి బ్రేక్ తెచ్చుకున్న కాజల్ ఇటీవల 'మగధీర' చిత్రంలో యువరాణి మిత్రవిందగా ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇటీవలే ఆమె నటించిన 'గణేష్' విడుదల కాగా, అల్లు అర్జున్ కు జోడిగా నటించిన 'ఆర్య-2' విడుదలకు సిద్ధమవుతోంది. కొత్తగా ప్రభాస్ 'డార్లింగ్' చిత్రానికి కమిట్ అయింది. తాజాగా త్రీ ఏంజిల్స్ స్టూడియో పతాకంపై శేషు ప్రియాంక నిర్మించనున్న మరో చిత్రానికి కూడా కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ సంస్థకు అనుబంధంగా ఇటీవలే త్రీ ఏంజెల్స్ బ్యానర్ పై శేషు ప్రియాంక చిత్ర నిర్మాణం చేపట్టారు. తొలి చిత్రంగా నారా రోహిత్ కథానాయకుడుగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో 'బాణం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త తరహా కథ కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోంది. తొలి చిత్రానికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మలి చిత్రానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం సైతం విలక్షణ కథాంశంతో ఉంటుందని తెలుస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో నవదీప్, నిఖిల్, బిందుమాధవి, అదితీశ్రమ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రకాష్ అనే యువ దర్శకుడు పరిచయం కానున్నారు. దీనికి 'ఓం శాంతి' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అది త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
No comments:
Post a Comment