Monday, October 5, 2009

'పంచాక్షరి'గా అనుష్క

ఈ ఏడాది సంచలన విజయం సాధించిన 'అరుంధతి' చిత్రం తర్వాత మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రను పోషించేందుకు అనుష్క సన్నద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ పై నాగార్జున మేకప్ మన్ చంద్ర తొలిసారి నిర్మించబోతున్నారు. వి.సముద్ర దర్శకుడు. ఈ చిత్రానికి 'పంచాక్షరి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది.నాగార్జునకు చాలాకాలంగా మేకప్ ఆర్టిస్టుగా ఉన్న చంద్ర ఆయనతో పనిచేసిన 'సూపర్' చిత్రంతోనే అనుష్క తెలుగుతెరకు పరిచయమైంది. విప్పర్తి మధు అనే యువకుడు రాసిన కథతో చంద్ర ఇటీవల అనుష్కను అప్రోచ్ కావడంతో కథ నచ్చి ఆ చిత్రానికి అనుష్క అంగీకరించింది. 'సింహరాశి', 'శివరామరాజు', 'ఎవడైతే నాకేంటి', 'మల్లెపూవు' వంటి పలు కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఈ చిత్రాన్ని అనుష్క కెరీర్ లో ది బెస్ట్ గా నిలిపేందుకు పట్టుదలగా ఉన్నారు. డిసెంబర్ 11న ఈ చిత్రం ప్రారంభమై 2010 ఫ్రిబ్రవరి నాటికి పూర్తవుతుంది. అనుష్క ప్రస్తుతం మహేష్ తో 'వరుడు', క్రిష్ దర్శకత్వంలో 'వేదం' చిత్రాలతో పాటు తమిళంలో విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. రవితేజ హీరోగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న కొత్త చిత్రంలోనూ అనుష్క హీరోయిన్ గా ఎంపికైంది.

No comments:

Post a Comment