skip to main |
skip to sidebar
అనుష్క ది చూడలేదు చూస్తాను : త్రిష
అనుష్క ప్రధాన పాత్రలో లేడిఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా "అరుంధతి" చిత్రాన్ని తానింకా చూడనేలేదని ఇటీవల ఓ సందర్భంలో త్రిష వివరించింది. పైగా మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు చేయాలని ఉంది. కానీ అవకాశాలు రావడం లేదని త్రిష అంటోంది. మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే చాలు. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానని ప్రకటించేసింది.ఇటీవలే "అరుంధతి" చిత్రం పెద్ద విజయాన్ని సాధించిందని అందరూ అంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తానని త్రిష వెల్లడించింది. అయినా అందరిని ఆకట్టుకునే విధంగా భారీస్థాయిలో సినిమా చేస్తే తప్పకుండా సక్సెస్ కాదా.. అంటూ త్రిష ప్రశ్నిస్తోంది. ఇంకా తాను పరిస్థితులకు తగినట్లు ప్రవర్తిస్తానని త్రిష చెబుతోంది. ఏ ఎండకా గొడుగు.. అంటే.. తనను మరీ అంత తక్కువగా అంచనా వేయకండని హితవు పలికింది.
No comments:
Post a Comment