skip to main |
skip to sidebar
తండ్రికి భానుప్రియ.. కొడుకుతో నయనతార
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు శాండిల్ వుడ్ లో కూడా అడుగుపెట్టి దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన క్రెడిట్ కొట్టేయనుంది. తమిళ 'బిల్లా'తో తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార ఇప్పుడు అక్కడ కొంచెం స్లో అయింది. తెలుగులోనూ సరైన హిట్లు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల విడుదలైన 'ఆంజనేయులు' ఫ్లాప్ కావడంతో పాటు నయనతార హెయిర్ స్టయిల్, మేకప్ వంటివి ఎబ్బెట్టుగా ఉన్నాయనే విమర్శలూ ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో నటిస్తున్న 'అదుర్స్' పైనే నయన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎందుకైన మంచిది అనుకుందోమో ఏమీ కానీ ఇప్పుడు కన్నడంలో కూడా కాలుపెడుతోంది. కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ కు జోడిగా 'కీచక' అనే చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. కన్నడ 'కీచక' చిత్రంలో రవిచంద్రన్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటంతో పాటు దర్శకత్వం, సంగీతం కూడా అందించనున్నారు. తండ్రి పాత్రకు జోడిగా భానుప్రియ, కొడుకు పాత్రకు జంటగా నయనతార నటించనున్నారు.
No comments:
Post a Comment