skip to main |
skip to sidebar
సౌత్ స్కోప్ స్టైల్' అవార్డులు
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సిఇవోగా ఆంగ్లంలో వెలువడుతున్న తొలి దక్షిణాది సినీ పత్రిక 'సౌత్ స్టైల్'. ఇటీవలే చెన్నైలో నాలుగు దక్షిణాది భాషల సూపర్ స్టార్ లతో తొలి సంచిక ఆవిష్కరణ జరిగింది. గత వారమే ఈ పత్రిక మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా ఈ పత్రిక తొలి వార్షిక అవార్డుల సెర్మనీ కూడా నిర్వహించబోతోంది. 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డుల పేరిట వీటిని ప్రదానం చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 2007-2008 మధ్య కాలంలో ఈ నాలుగు భాషల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను ఎంట్రీలుగా తీసుకుని, ప్రేక్షకుల, జ్యూరీ సభ్యుల ఓటింగ్ ను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎన్నుకుంటారు. 'సౌత్ స్కోప్' టీమ్ ఆదివారంనాడు ఆ విశేషాలను హైద్రాబాద్ లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నటి ఇలియానా గెస్ట్ గా పాల్గొని అవార్డుల ట్రోపీని ఆవిష్కరించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ, నాలుగు దక్షిణాది భాషల నటీనటులను ఒకే వేదికపైకి తీసుకు రావాలనే ఆలోచనతోనే 'సౌత్ స్కోప్' ప్రారంభించామనీ, నటీనటుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైలనీ అన్నారు. ఆ స్టైల్ కు అవార్డులు ఇవ్వాలనే ఆలోచనతోనే 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డుల ప్రదానం జరుపబోతున్నామని అన్నారు. నాలుగు భాషల్లోనూ స్టైలిష్ ఫిల్మ్, స్టైలిష్ యాక్టర్, స్టైలిష్ యాక్ట్రస్, స్టైలిష్ ఆల్బమ్, స్టైలిష్ సాంగ్ కొరియోగ్రఫీ అవార్డులతో పాటు, సౌత్ స్టైల్ ఐకాన్ అవార్డు, సౌత్ స్టైల్ యూత్ ఐకాన్ అవార్డులు ప్రదానం చేయబోతున్నట్టు చెప్పారు. ఆడియెన్స్ పోల్ తో పాటు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లయిన అష్మిత మార్వ, వెండిల్ రోడ్రిక్స్, ప్రసాద్ బిడప తదితరులతో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 25న హైద్రాబాద్ నోవోటెల్ లో సాయంత్రం 7 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment