
వినాయక్ మాట్లాడుతూ, తారక్ (ఎన్టీఆర్) తో తాను చేస్తున్న మూడో సినిమా ఇదనీ, తారక్ ఇమేజ్ కు తగ్గట్టుగా అన్ని వర్గాలనూ ఆకర్షించే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ చెప్పారు. తమ కాంబినేషన్ లో వస్తున్న మరో సెన్సేషన్ ఫిల్మ్ ఇదని తెలిపారు. ఏకథాటిగా నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుందని వంశీమోహన్ చెప్పారు. ఎన్టీఆర్-వినయ్ (వినాయక్) కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందనీ, డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ అన్నారు. చాలా హై రేంజ్ లో తీస్తున్న చిత్రమిదనీ, ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో ఓ ల్యాండ్ మార్క్ ఫిలిమ్ అవుతుందనీ కొడాలి నాని తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, మరో కథానాయికగా షీలా నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ, సుధ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment