Sunday, October 4, 2009

రవితేజ 'డాన్ శీను'

డాన్ పాత్రలపై ఇప్పుడు తెలుగు హీరోలు కన్నేశారు. నాగార్జున 'డాన్' చిత్రంలో, ప్రభాస్ 'బిల్లా'లో డాన్ పాత్రలు పోషించగా, 'అదుర్స్'లో ఎన్టీఆర్ సైతం డాన్ గా కనిపించబోతున్నారు. తాజాగా రవితేజ సైతం 'డాన్ శీను' అవతారం ఎత్తబోతున్నారు. రవితేజ కథానాయకుడుగా 'కిక్' వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు మరోసారి రవితేజతో ఓ కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రకటించింది. ఈ చిత్రానికి 'డాన్ శీను' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది.రవితేజకు జోడిగా అనుష్క ఇందులో నటించనుంది. 'విక్రమార్కుడు', 'బలాదూర్' చిత్రాలకు ఈ జంట కలిసి పనిచేస్తుండటం ఇది మూడోసారి. ఇందులో శ్రీహరి మరో కీలక పాత్ర పోషించనున్నారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం ఇదే నెలలో సెట్స్ పైకి రానుంది.

No comments:

Post a Comment