skip to main |
skip to sidebar
భువనేశ్వరి కథతో సినిమా?
తెరపై వ్యాంప్ రోల్స్ లో ఎక్కువగా కనిపించే నటి భువనేశ్వరి సీరియల్స్ లో లేడీ విలన్ గా పాపులర్. ఇటీవల భువనేశ్వరి మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఆమె చెన్నైలోని తన నివాసంలో ఓ ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడటం, అనంతరం మరికొందరి తారలపై పడుపువృత్తి నడుపుతున్న అభియోగం చేయడం చెన్నై ఫిలిమ్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టించింది. భువనేశ్వరి చెప్పినట్టు పేర్కొంటూ పలువురి తారల పేర్లు దినమలర్ పత్రిక ప్రచురించడం, ఆర్టిస్టుల సంఘం కన్నెర్ర చేయడంతో సదరు పత్రిక ఎడిటర్ ను అరెస్టు చేసి ఆ తర్వాత బెయిలుపై విడుదల చేయడం చకచగా జరిగిపోయాయి. ఈ పరిణామాలు సినీ ఆర్టిస్టులకూ, పాత్రికేయులకూ మధ్య చిచ్చు రేపింది. భువనేశ్వరి భాగోతం ఇప్పుడు సహజంగానే కొందరి నిర్మాతల దృష్టిని ఆకర్షించడంతో సరిగ్గా ఇదే లైన్స్ లో కథలు కూడా రెడీ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. భువనేశ్వరి కథతో సినిమా తీయాలనే పట్టుదలతో పలువురు నిర్మాతలు ఇప్పటికే ఆమెను జైలులోనే కాంటాక్ట్ చేస్తున్నారట. రియల్ లైఫ్ స్టోరీలను ఇతివృత్తాలుగా తీయడం సహజమే అయినా...వ్యభిచార నేరంపై రెండు మూడు సార్లు పట్టుబడిన భువనేశ్వరి స్టోరీని కథగా తీయడం వల్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పొంచి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే ప్రధానంగా నిర్మాతలకు ఉండి ఉండొచ్చు. భువనేశ్వరి పాత్రకు ఆమెనే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఇందుకు పెద్ద మొత్తంలో నిర్మాతలు పారితోషికం ఆఫర్ చేస్తున్నారనీ అంటున్నారు. ఇప్పటికే తెర వెనుక ఉన్నపలువురి తారలపై గుర్రుగా ఉన్న భువన తాజాగా తన అక్కసును వెండితెరపై కూడా వెళ్లగక్కుతుందోమో చూడాలి...
No comments:
Post a Comment