
ఐడియాలో పెద్దది...బడ్జెట్ పరంగా చిన్నదిగా ఈ చిత్రం రూపొందడం రికార్డనీ, 'వినాయకుడు' చిత్రానికి 2.4 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, 1.38 కోట్ల రూపాయల బడ్జెట్ లో 'విలేజ్ లో వినాయకుడు' పూర్తయిందని నిర్మాత మహి తెలిపారు. ఈ ఏడాదిలో అతి తక్కువ బడ్జెట్ తో పూర్తయిన చిత్రంగా ఇదో రికార్డు కానుందని అన్నారు. అయితే ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా దృశ్యపర్వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. అలాగే ఆడియో చాలా పెద్ద హిట్టయిందనీ, 9.98 రూపాయలకే సిడీ అందించడంతో ఈ ఏడాది అతి పెద్ద సెల్లింగ్ ఆల్బమ్ క్రెడిట్ కూడా తమ చిత్రానికే దక్కనుందని అన్నారు. ఈ చిత్రానికి రిలెయన్స్, కళామందిర్, ఫ్యూచర్ జెనెరలి వంటి 10కి పైగా మీడియా పార్టనర్స్ ఉండటం మరో విశేషం. చందమామ పుస్తకంలోని కథలా ఈ చిత్రం ఉంటుందనీ, ఎక్కువ భాగం షూటింగ్ రాజోలు పరిసర ప్రాంతాల్లో జరిపామనీ దర్శకుడు సాయికిరణ్ అడవి తెలిపారు. ఈనెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ ముఖ్య పాత్రను పోషించారు. రావు రమేష్, జోగినాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి మహి కథ, వనమాలి పాటలు, రమణ సాల్వా సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఖాద్రి సంగీతం అందించారు.
No comments:
Post a Comment