Thursday, October 8, 2009

నిర్మాతల ఫోన్‌ కట్‌ చేసిన నమిత

దక్షిణాది సెక్సీ తారల్లో నమితకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె సినిమాలంటే టీనేజ్ కుర్రకారు ఎగబడతారు. ఈ విషయాన్ని గమనించిన బాలీవుడ్ హిందీ నిర్మాతలు కొందరు నమితకు తాము నిర్మించబోయే చిత్రంలో అవకాశమిస్తామన్నారట. దాంతో ఒక్క గెంతేసి... పట్టరాని ఆనందంలో తేలియాడుతూ... ఆ సినిమాలో తన పాత్ర ఏమిటని అడిగిందట నమిత. ఆ ప్రశ్నకు హిందీ నిర్మాతల నుంచి వచ్చిన సమాధానాన్ని విని దిమ్మెరపోయిందట.రాజారవివర్మ జీవితాన్ని తాము తెరకెక్కిస్తున్నామనీ, ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చిత్రించిన కొన్ని నగ్న చిత్రాలకు ప్రతిరూపంగా నటించాల్సి ఉంటుందని నమితకు చెప్పారట. దీంతో చిర్రెత్తిన నమిత ఫోన్ కట్ చేసిందట. ఆ ఆఫర్ విషయాన్ని తన చెవికేసిన వ్యక్తిపై ఇంతెత్తు ఎగిరిందట. ఎలాగూ అందాలు చూపిస్తుంది కదా... అరకొరగా మిగిలిన అందాలను కూడా వెండితెరపై ఆరబోస్తుందేమో అడగమంటే అడిగానని సదరు వ్యక్తి గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట.

No comments:

Post a Comment