Thursday, October 8, 2009

భూమికను పెళ్ళిచేసుకున్న ప్రకాష్‌రాజ్‌

ప్రకాష్‌రాజ్‌, భూమికలు పెళ్ళి చేసుకున్నారు... ఇది నిజమేనండీ... అది కూడా వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రంలో... యోగా గురువు భరత్‌ఠాగూర్‌ని పెళ్ళి చేసుకున్న భూమిక మంచి అండర్‌స్టాండింగ్‌తో కాపురం సాగిస్తోంది. తాజాగా ప్రకాష్‌రాజ్‌, భూమిక జంటగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో భార్య, భర్తల మధ్య అనుబంధం, అవగాహన తదితర అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో భార్యాభర్తలుగా భూమిక, ప్రకాష్‌రాజ్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అమోద్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరిట ఓ నిర్మాణసంస్థను ప్రారంభించి టేకుల కృపాకర్‌రెడ్డి అనే ఓ విద్యాధికుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.వనితావాణి- ఎ.రాధికారెడ్డి అనే ఇద్దరు మహిళలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌-భూమిక జంటగా నటిస్తుండగా పరుచూరి బ్రదర్స్‌ రచన చేస్తున్నారు. చిన్నా సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మలి షెడ్యూల్‌ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుందని, నవంబర్‌లో జరిగే మూడవ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుందని, డిసెంబర్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వి.వనితావాణి, ఎ.రాధికారెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment