Thursday, October 8, 2009

వరదబాధితుల సహాయార్థం రామోజీరావు కోటి విరాళం

కర్నూలు, మంత్రాలయం, నంద్యాల, మెహబూబ్ నగర్ , దివిసీమ, గుంటూరు జిల్లాలోని అనేక లంక గ్రామాలు, తుంగభద్ర, కృష్ణమ్మల ఆగ్రహానికి గురై అతలాకుతలమయ్యాయి.ప్రాణాలు కోల్పోయిన వారెందరో,ఇళ్ళు,ఆస్తులు కోల్పోయిన వారూ, తమ సర్వస్వాన్నీ కోల్పోయిన వారూ ఈ వరదబాధితుల్లో ఉన్నారు.వారికి ప్రతి ఒక్క మానవతా వాది తమ ఆపన్న హస్తాన్ని అందించి ఆదుకోవాలి.ఈ దిశగా ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ ఉన్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, మీడియా పర్సన్ అయిన రామోజీరావు గారు తన వంతు సాయంగా వరదబాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ధనం అందరి దగ్గరా ఉంటుంది.కానీ సాయంచేసే పెద్ద మనసు ఎందరికి ఉంటుంది....? ఇలాంటి ఏ కొద్దిమందికో తప్ప.

No comments:

Post a Comment