skip to main |
skip to sidebar
ఆదికి జెల్లకొట్టిన వర్మ
రామ్ గోపాల్ వర్మ పేరు చెబితే సంచలనాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసే సినిమాలు విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన తర్వాత చకితికలపడుతున్నాయి. అయినప్పటికీ వర్మ తనదైన శైలిలో సినిమాలు తీయడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఆయన పరిటాల రవి జీవిత చరిత్రతో 'రక్త చరిత్ర' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తెలుగు హీరో లేకుండా తీస్తున్న తెలుగు సినిమా ఇది కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ఈ చిత్రాన్ని చేయనున్నారు. ఈ 3 భాషల్లోనూ పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించనుండగా, సూరి పాత్రను తమిళ హీరో సూర్య చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ లో పరిటాల రవి పాత్రను ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది ('మృగం' ఫేమ్) పోషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వర్మ తాజాగా ఖండించారు. ప్రదీప్ పినిశెట్టి అలియాస్ ఆదితో అగ్రిమెంట్ చేసిన విషయం నిజమేననీ, అయితే అది 'రక్తచరిత్ర' సినిమా కోసం కాదనీ వర్మ వివరణ ఇచ్చారు. ధర్మ-రక్ష అనే కొత్త దర్శకులతో ఈ సినిమా ఉంటుందన్నారు. 'రక్తచరిత్ర' మూడు భాషల్లోనూ వేవేక్, సూరి నటిస్తారనీ, వివేక్ విషయానికి వస్తే అతని తండ్రి హైద్రాబాద్ నుంచి వచ్చిన వారేననీ, దాంతో వివేక్ కు తెలుగు బాగా వచ్చనీ అన్నారు. అయితే వాచకంలో పెర్ ఫెక్షన్ కోసం అతను శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ చిత్రం ద్వారా మణిశర్మ సంగీత దర్శకుడుగా తొలిసారి హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నాలుగున్నర గంటల నిడివితో రెండు భాగాలుగా 'రక్తచరిత్ర' తెరకెక్కనుంది. రాయలసీమ ఏరియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు.
No comments:
Post a Comment