
ఈ సీక్వెల్ లో తొలి వెర్షన్ లో నటించిన ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా నటించబోతున్నారు. ఆయనకు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేయనున్నారు. సునీల్, వేణుమాధవ్ కీలక పాత్రలు పోషించనున్నారు. బ్యాంకాక్ లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ అయిందనీ, దీనిని లగడపాటి శ్రీధర్ నిర్మించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. అలా కాని పక్షంలో ఇవివి సినిమా పతాకంపై ఇవివి సత్యనారాయణ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇవివి సత్యనారాయణ కుమారుల్లో ఒకరైన అల్లరి నరేష్ ఇప్పటికే కామెడీ హీరోగా సెటిల్ కాగా, ఆర్యన్ రాజేష్ ఇటీవల కాలంలో సరైన హిట్లు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సీక్వెల్ తో రాజేష్ కు సరైన బ్రేక్ ఇచ్చేందుకు ఇవివి పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment