Saturday, October 10, 2009

యూత్ ఫుల్ 'జాయ్'

అవితేజ్, త్రినాథ్, పార్వతి, వైనవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇవివి కంభన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు 'జాయ్' అనే టైటిల్ ను నిర్ణయించారు. బి.రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

దర్శకుడు రాజా మాట్లాడుతూ, ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఎంతో స్నేహంగా ఉండే ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల మధ్య అనుకోకుండా ప్రేమ చిగురిస్తుందనీ, అయితే స్నేహానికి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో ఆ ప్రేమను వారు మనసులోనే దాచుకుంటారనీ, చివరకు వారి స్నేహం గెలిచిందా, ప్రేమ గెలిచిందా అనేది ఆసక్తికరంగా ఉంటుందనీ తెలిపారు. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చాలా బాగా నటించారనీ, ఇందులో సునీల్ పాత్ర హైలైట్ గా నిలుస్తుందన్నారు. అలాగే విద్యాసాగర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ, పాటల చిత్రీకరణ విషయంలోనూ నిర్మాత ఖర్చుకు వెనుకాకుండా రిచ్ గా తీశారనీ చెప్పారు. నిర్మాత కంబన్ మాట్లాడుతూ, చక్కటి కాన్సెప్ట్ తో వస్తున్న 'జాయ్' అందర్నీ అలరిస్తుందని చెప్పారు. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రతి సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారనీ, మలేసియాలోని అందమైన లొకేషన్లలో రెడు పాటలు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పబ్ సాంగ్ తో పాటు 15 రోజుల టాకీ, వైజాగ్ లో ఓ పాట, కొంత టాకీ, హైద్రాబాద్ లోని వివిధ లొకేషన్లలో మరో పాట ఎంతో రిచ్ గా తీశామని చెప్పారు. ఇవాల్టి యూత్ ఫిల్మ్స్ లో 'జాయ్' కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ప్రస్తుతం డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్ జరుగుతోందనీ, ఈ నెలలోనే ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలు, నవంబర్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. వెన్నెరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బి.రాజా కథ, ఆకాష్ అశోక్ కుమార్ సినిమటోగ్రఫీ, భువనచంద్ర పాటలు, స్వర్ణ సుధాకర్ మాటలు, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

No comments:

Post a Comment