Sunday, October 4, 2009

Jr.NTR UpComing Movie Adurs


'కంత్రి' చిత్రంలో స్లిమ్ లుక్ తో అందర్నీ ఆకట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫ్రెష్ లుక్ తో 'అదుర్స్' అనిపించుకోబోతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న 'అదుర్స్' (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) చిత్రం ఇటీవల కలకత్తాలో జరిగిన షూటింగ్ తో మూడొంతులు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కు జోడిగా నయనతార నటిస్తోంది. ఈ ఇద్దరి జంట ఎలా ఉండబోతోందనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. ఆ ఉత్సుకతకు కొద్దిగా తెరదించుతూ సెలక్టివ్ గా వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఎన్టీఆర్-నయనతార జంట మంచి రొమాంటింక్ పెయిర్ గా అనిపించుకోవడం ఖాయమనే విధంగా ఈ స్టిల్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ గా షీలా నటిస్తోంది.ఎన్టీఆర్ ఈ చిత్రంలో బ్రాహ్మణ యువకుడిగానూ, డాన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ విలన్ పాత్ర పోషిస్తుండగా, ఛార్మి ఓ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తోంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలైట్స్ కానున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment