Sunday, October 4, 2009

అభిమానికి బాలయ్య సాయం

అభిమానులు లేకుంటే స్టార్స్ లేరు. వారికి అలాంటి హోదా కట్టపెట్టింది నిస్సందేహంగా అభిమానులే. స్టార్స్ సైతం అభిమాన బలంతోనే ఎప్పటికప్పుడు తన కేరీర్ ను మలుచుకుంటూ ఉన్నత శిఖరాలు చేరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అభిమానులకు ఏదైనా జరగకూడదని జరిగితే స్టార్స్ తల్లడిల్లిపోతుంటారు. ప్రమాదంలో మరణించిన అభిమానుల కుటుంబాలను ఓదార్చి వారికి వీలైనంత సాయం చేసి తమ కృతజ్ఞతను చాటుకుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.శ్రీకాళహస్తికి చెందిన నైనార్ రఘు బాలకృష్ణ వీరాభిమాని. సుదీర్ఘ అస్వస్థతతో రెండ్రోజుల క్రితమే అతను కన్నుమూశాడు. ఆ విషయం తెలుసుకున్న బాలకృష్ణ నేరుగా రఘు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రఘు కుటుంబానికి తక్షణ సహాయంగా 3 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాననీ, అతని కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తామనీ భరోసా ఇచ్చారు. సుమారు గంట సేపు రఘు కుటుంబ సభ్యులతో ఆయన కలిసి ఉన్నారు. బాలకృష్ణ వచ్చిన వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో అ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అభిమాని కుటుంబాన్ని బాలయ్య బాబు పరామర్శించి, ఆదుకున్న తీరు పలువురి ప్రశంసలు అందుకుంది.

No comments:

Post a Comment