Monday, November 9, 2009

నరేష్ 'బెట్టింగ్ బంగార్రాజు'

పరిశ్రమలో ఏటా ఎక్కువ సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంట్ హీరో అనిపించుకుంటున్న అల్లరి నరేష్ ఇటీవల పెద్ద బ్యానర్ల నుంచి కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆయన నటించగా ఇటీవల విడుదలైన 'బెండు అప్పారావు ఆర్ఎంపి' బాక్సాఫీస్ హిట్ నమోదు చేసుకుంది. 3 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెబుతున్న ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూలు చేయనున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ తదుపరి చిత్రానికి 'బెట్టింగ్ బంగార్రాజు' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతోంది

No comments:

Post a Comment