Friday, November 6, 2009

అబ్బాస్ క్రైమ్ స్టోరీ

ఆర్థిక మాంద్యం వల్ల అనుకోని పరిస్థితుల్లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒక నేరంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తకరం. ఈ కథాంశంతో అబ్బాస్, షఫి, మురళీ శర్మ ('అతిథి' ) ప్రధాన పాత్రల్లో నరసా మీడియా క్రియేషన్స్ ఓ క్రైమ్ థ్రిల్లర్ ను నిర్మిస్తోంది. అమర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి.అరుణ, కె.వి.బాబ్జీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉంది. సంస్థ కార్యాలయంలో చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, ఇంతవరకూ 60 శాతం వరకూ షూటింగ్ పూర్తయిందనీ దర్శకుడు అమర్ తెలిపారు. కొంత షూటింగ్ చెన్నైలో ప్లాన్ చేసినట్టు చెప్పారు. చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన బాబ్జి మాట్లాడుతూ, కన్నడంలో 16 చిత్రాలకు సంగీతం అందించిన తాను తెలుగులో 'నీ తోడు కావాలి' చిత్రానికి సంగీతం అందించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో 4 పాటలు ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 12న షూటింగ్ ప్రారంభించామనీ, డిసెంబర్ చివరి వారంలో కానీ, జనవరి మొదటివారంలో కానీ సినిమాను రిలీజ్ చేస్తామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కాదల్ దండపాణి, భరణి, సుమన్ శెట్టి, మేల్కొటి, రాజేష్, కీర్తిచావ్ల, తనూరాయ్, అపూర్వ, రజిని, పూనమ్, బేబి విశాఖ తదితరులు నటిస్తున్నారు. చైతన్య ప్రసాద్ మాటలు, రామారావు-రాంబాబు పాటలు, జి.ఎస్.రావు సినిమాటోగ్రఫీ, పి.శ్రీనివాస్ ఎడిటింగ్ అందిస్తున్నారు

No comments:

Post a Comment