skip to main |
skip to sidebar
బికినీలో సునీల్?
కమెడియన్లు ఒంటిమీద చీర చుడితే ప్రేక్షకులకు అదో కిక్. రాజబాబు, పద్మనాభం, రాజేంద్రప్రసాద్, నరేష్, ఆలీ వంటి పలువురు కమెడియన్లు చీర సింగారించుకుని నవ్వులు పూయించిన వారే. నలుగురూ నడిచిన రూట్లో నటిస్తే గొప్పేముంది? కమెడియన్లలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న సునీల్ ఇప్పుడు ఏకంగా బికినీలో ఇమిడిపోయేందుకు రెడీ అవుతున్నారట. 'అందాలరాముడు' చిత్రం తర్వాత సునీల్ రెండోసారి కథానాయకుడుగా నటిస్తున్న 'మర్యాద రామన్న' చిత్రంలోని ఓ సాంగ్ లో సునీల్ బికినీ అందాలు ప్రదర్శించబోతున్నట్టు సమాచారం.రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఇతివృత్తమిది. అయితే క్యారెక్టర్లన్నీ కామెడీతో అనుసంబంధానమై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇంతవరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రాలకు పనిచేయని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సునీల్ కు జోడిగా సలోని నటించనున్న ఈ చిత్రంలో నాగినీడు (ప్రసాద్ ల్యాబ్స్ ) బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఎస్.ఎస్.కంచి కథ, రవీందర్ కళాదర్శకత్వం, రమారాజమౌళి కాస్ట్యూమ్స్, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర,ఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించనున్నారు.
No comments:
Post a Comment