
కన్నడంలో అజయ్ అనే కొత్త నటుడితో చంద్రు దర్శకత్వంలో శివశంకర్ రెడ్డి నిర్మించిన 'తాజ్ మహల్'కు రీమేక్ గా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో కన్నడ మూలంతో రూపొందిన 'సందడే సందడి', 'అదిరిందయ్యా చంద్రం' చిత్రాలు విజయవంత కావడంతో ఇప్పుడు నిర్మాతగా కూడా తనకు ఈ కన్నడ రీమేక్ మంచి సక్సెస్ ఇస్తుందని శివాజీ నమ్మకంతో ఉన్నారు. ఇటీవల కాలంలో శివాజీ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడం, 'మంత్ర' విజయవంతమైనప్పటికీ హిట్ క్రెడిట్ ఛార్మి ఎగరేసుకుపోవడంతో శివాజీ తన ఉనికిని బలంగా చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా మారారు. ముంతాజ్ కోసం షాజహాన్ 'తాజ్ మహల్' నిర్మిస్తే, హిట్ కోసం శివాజీ ఈ 'తాజ్ మహల్' నిర్మిస్తున్నారు. కన్నడంలో 'తాజ్ మహల్' ఘన విజయం సాధించడం కూడా శివాజీ ఆశలను మరింత పెంచుతోంది. ఈనెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శివాజీ ప్లాన్ చేస్తున్నారు
No comments:
Post a Comment